Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Ash-Shuraa — Ayah 7

وَكَذَٰلِكَ أَوۡحَيۡنَآ إِلَيۡكَ قُرۡءَانًا عَرَبِيّٗا لِّتُنذِرَ أُمَّ ٱلۡقُرَىٰ وَمَنۡ حَوۡلَهَا وَتُنذِرَ يَوۡمَ ٱلۡجَمۡعِ لَا رَيۡبَ فِيهِۚ فَرِيقٞ فِي ٱلۡجَنَّةِ وَفَرِيقٞ فِي ٱلسَّعِيرِ ٧
ఓ ప్రవక్తా మేము మీ కన్న మునుపటి ప్రవక్తలకు దైవవాణి పంపించినట్లే మీ వైపున అరబీ ఖుర్ఆన్ ను దైవవాణి ద్వారా పంపించినాము. మీరు మక్కా వాసులను,దాని పరిసరములైన అరబ్ బస్తీలను, ఆ తరువాత ప్రజలందరిని హెచ్చరించటానికి మరియు అల్లాహ్ లెక్క తీసుకోవటం కొరకు,ప్రతిఫలం ప్రసాదించటం కొరకు ముందు వారిని మరియు చివరి వారిని ఒకే భూమిలో సమీకరించే రోజైన ప్రళయదినము నుండి ప్రజలను మీరు భయపెట్టటానికి. ఆ రోజు వాటిల్లటంలో ఎటువంటి సందేహం లేదు. మరియు ప్రజలు అందులో రెండు వర్గములుగా విభజించబడి ఉంటారు : ఒక వర్గము స్వర్గములో ఉంటారు, వారు విశ్వాసపరులు. మరియు ఒక వర్గము నరకాగ్నిలో ఉంటారు, వారు అవిశ్వాసపరులు.