Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Az-Zukhruf — Ayah 57

۞ وَلَمَّا ضُرِبَ ٱبۡنُ مَرۡيَمَ مَثَلًا إِذَا قَوۡمُكَ مِنۡهُ يَصِدُّونَ ٥٧
మరియు ఎప్పుడైతే క్రైస్తవులు ఆరాధించే ఈసా అలైహిస్సలాం ను ముష్రికులు మహోన్నతుడైన ఆయన ఈ వాక్యంలో ఉన్నాడని భావించారో : {إِنَّكُمْ وَمَا تَعْبُدُونَ مِنْ دُونِ اللَّهِ حَصَبُ جَهَنَّمَ أَنْتُمْ لَهَا وَارِدُونَ} నిశ్ఛయంగా మీరు మరియు అల్లాహ్ ను వదిలి మీరు ఆరాధించే దైవాలు నరకానికి ఇంధనం అవుతారు. మీరంతా దానిలో ప్రవేశిస్తారు (అల్ అన్బియా). వాస్తవానికి అల్లాహ్ విగ్రహాలను ఆరాధించటం నుండి వారించినట్లుగానే ఆయన ఆరాధన నుండి వారించాడు. అప్పుడు ఓ ప్రవక్తా మీ జాతివారు తగువులాటలో ఇలా పలుకుతూ అరిచేవారు మరియు కేకలు వేసేవారు : ఈసా యొక్క స్థానంలో మా దైవాలు అవటమును మేము ఇష్టపడుతున్నాము. అప్పుడు అల్లాహ్ వారిని ఖండిస్తూ ఇలా అవతరింపజేశాడు : "నిశ్చయంగా ముందు నుంచే మా వద్ద ఎవరి కొరకు మేలు ఖరారై ఉందో వారంతా నరకానికి దూరంగా ఉంచబడుతారు" (అల్ అన్బియా) {إِنَّ الَّذِينَ سَبَقَتْ لَهُمْ مِنَّا الْحُسْنَى أُولَئِكَ عَنْهَا مُبْعَدُونَ}.