Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Az-Zukhruf — Ayah 63

وَلَمَّا جَآءَ عِيسَىٰ بِٱلۡبَيِّنَٰتِ قَالَ قَدۡ جِئۡتُكُم بِٱلۡحِكۡمَةِ وَلِأُبَيِّنَ لَكُم بَعۡضَ ٱلَّذِي تَخۡتَلِفُونَ فِيهِۖ فَٱتَّقُواْ ٱللَّهَ وَأَطِيعُونِ ٦٣
మరియు ఈసా అలైహిస్సలాం తాను ఒక ప్రవక్త అవటంపై స్పష్టపరిచే సూచనలను తీసుకుని తన జాతి వారి వద్దకు వచ్చినప్పుడు వారితో ఇలా పలికారు : నిశ్చయంగా నేను మీ వద్దకు అల్లాహ వద్ద నుండి విజ్ఞతను (హిక్మత్) తీసుకుని వచ్చాను. మరియు నేను మీరు మీ ధర్మ విషయాల్లోంచి విభేదించుకుంటున్న వాటిలో కొన్నింటిని మీకు స్పష్టపరుస్తాను. కావున మీరు అల్లాహ్ కు ఆయన ఆదేశములను పాటించి మరియు ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భయపడండి. మరియు నేను మీకు ఆదేశించిన వాటి విషయంలో మరియు మీకు వారించిన వాటి విషయంలో నాపై విధేయత చూపండి.