Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Az-Zukhruf — Ayah 65

فَٱخۡتَلَفَ ٱلۡأَحۡزَابُ مِنۢ بَيۡنِهِمۡۖ فَوَيۡلٞ لِّلَّذِينَ ظَلَمُواْ مِنۡ عَذَابِ يَوۡمٍ أَلِيمٍ ٦٥
అయితే ఈసా అలైహిస్సలం విషయంలో క్రైస్తవ వర్గాలు విభేదించుకున్నాయి. వారిలో నుండి కొందరు ఆయనను దైవం అన్నారు మరియు మరి కొందరు ఆయనను అల్లాహ్ కుమారుడన్నారు మరియు మరి కొందరు ఆయన,ఆయన తల్లి ఇద్దరు దేవుళ్ళన్నారు. ఈసా అలైహిస్సలాం ను దైవత్వముతో లేదా దైవ కుమారునితో లేదా ముగ్గురిలో నుండి మూడో వాడితో పోల్చటం వలన తమ స్వయమునకు అన్యాయం చేసుకున్న వారి కొరకు ప్రళయదినమున వారి గురించి నిరీక్షించే బాధాకరమైన శిక్షతో వినాశనం కలుగును.