Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Al-Jathiyah — Ayah 32

وَإِذَا قِيلَ إِنَّ وَعۡدَ ٱللَّهِ حَقّٞ وَٱلسَّاعَةُ لَا رَيۡبَ فِيهَا قُلۡتُم مَّا نَدۡرِي مَا ٱلسَّاعَةُ إِن نَّظُنُّ إِلَّا ظَنّٗا وَمَا نَحۡنُ بِمُسۡتَيۡقِنِينَ ٣٢
నిశ్ఛయంగా అల్లాహ్ తన దాసులకు ఆయన వారిని మరణాంతరం లేపి వారికి ప్రతిఫలమును ప్రసాదిస్తానని చేసిన వాగ్దానము ఎటువంటి సందేహం లేని సత్యమని, ప్రళయం సత్యమని అందులో ఎటువంటి సందేహం లేదని మీరు దాని కొరకు ఆచరణలు చేయండి అని మీతో తెలపబడినప్పుడు మీరు ఇలా పలికారు : ఈ ప్రళయం ఏమిటో మాకు తెలియదు. అది వస్తుంది అన్నది బలహీనమైన ఊహగానమని మేము భావిస్తున్నాము. అది తొందరలోనే రాబోతున్నదన్న విషయమును మేము నమ్మము.