Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Al-Jathiyah — Ayah 35

ذَٰلِكُم بِأَنَّكُمُ ٱتَّخَذۡتُمۡ ءَايَٰتِ ٱللَّهِ هُزُوٗا وَغَرَّتۡكُمُ ٱلۡحَيَوٰةُ ٱلدُّنۡيَاۚ فَٱلۡيَوۡمَ لَا يُخۡرَجُونَ مِنۡهَا وَلَا هُمۡ يُسۡتَعۡتَبُونَ ٣٥
మీరు శిక్షించబడిన ఈ శిక్షకు కారణం మీరు అల్లాహ్ ఆయతులను పరిహాసంగా చేసుకుని వాటి పట్ల హేళన చేయటం. మరియు ఇహలోక జీవితం తన రుచుల ద్వారా,తన కోరికల ద్వారా మిమ్మల్ని మోసపుచ్చింది. కావున ఈ రోజు అల్లాహ్ ఆయతుల పట్ల హేళన చేసే ఈ అవిశ్వాసపరులందరు నరకాగ్ని నుండి బయటకు రాలేరు. అంతే కాదు వారు అందులో శాశ్వతంగా ఉండిపోతారు. మరియు వారు సత్కర్మలు చేసుకోవటానికి ఇహలోకజీవితం వైపునకు మరలించబడరు. మరియు వారి నుండి వారి ప్రభువు ప్రసన్నుడవడు.