Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Al-Ahqaf — Ayah 15

وَوَصَّيۡنَا ٱلۡإِنسَٰنَ بِوَٰلِدَيۡهِ إِحۡسَٰنًاۖ حَمَلَتۡهُ أُمُّهُۥ كُرۡهٗا وَوَضَعَتۡهُ كُرۡهٗاۖ وَحَمۡلُهُۥ وَفِصَٰلُهُۥ ثَلَٰثُونَ شَهۡرًاۚ حَتَّىٰٓ إِذَا بَلَغَ أَشُدَّهُۥ وَبَلَغَ أَرۡبَعِينَ سَنَةٗ قَالَ رَبِّ أَوۡزِعۡنِيٓ أَنۡ أَشۡكُرَ نِعۡمَتَكَ ٱلَّتِيٓ أَنۡعَمۡتَ عَلَيَّ وَعَلَىٰ وَٰلِدَيَّ وَأَنۡ أَعۡمَلَ صَٰلِحٗا تَرۡضَىٰهُ وَأَصۡلِحۡ لِي فِي ذُرِّيَّتِيٓۖ إِنِّي تُبۡتُ إِلَيۡكَ وَإِنِّي مِنَ ٱلۡمُسۡلِمِينَ ١٥
మరియు మేము మానవునికి తన తల్లిదండ్రుల పట్ల వారికి వారి జీవితంలో మరియు వారి మరణం తరువాత ధర్మమునకు వ్యతిరేకం కాని మంచి చేసి ఉత్తమంగా మెలగమని గట్టి ఆదేశమును ఇచ్చాము. ముఖ్యంగా తన తల్లిని ఎవరైతే తనను గర్భంలో కష్టంగా భరించిందో మరియు తనను కష్టంగా జన్మనిచ్చిందో. మరియు తను గర్భంలో నిలదొక్కుకుని తన పాలు విడిపించే సమయం మొదలయ్యే వరకు కాలము ముప్పై నెలలు అవుతుంది. చివరికి అతను బౌద్ధిక మరయు శారీరక తన రెండు బలములను పరిపూర్ణం చేసుకునటమునకు చేరుకున్నప్పుడు మరియు నలభై సంవత్సరములను పూర్తి చేసుకున్నప్పుడు ఇలా పలుకుతాడు : ఓ నా ప్రభువా నీవు నాపై, నా తల్లిదండ్రులపై అనుగ్రహించిన నీ అనుగ్రహాలపై నేను కృతజ్ఞతను తెలుపుకోవటానికి నాకు స్పూర్తినివ్వు మరియు నేను నీవు సంతుష్టపడి నా నుండి స్వీకరించే సత్కర్మను చేసే నాకు స్పూర్తినివ్వు. మరియు నీవు నా సంతానమును నా కొరకు తీర్చి దిద్దు. నిశ్చయంగా నేను నా పాపముల నుండి పశ్ఛాత్తాప్పడుతూ నీ వైపునకు మరలాను. మరియు నిశ్చయంగా నేను నీ విధేయతకు కట్టుబడి ఉన్నాను,నీ ఆదేశములకు విధేయుడను.