Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Al-Ahqaf — Ayah 17

وَٱلَّذِي قَالَ لِوَٰلِدَيۡهِ أُفّٖ لَّكُمَآ أَتَعِدَانِنِيٓ أَنۡ أُخۡرَجَ وَقَدۡ خَلَتِ ٱلۡقُرُونُ مِن قَبۡلِي وَهُمَا يَسۡتَغِيثَانِ ٱللَّهَ وَيۡلَكَ ءَامِنۡ إِنَّ وَعۡدَ ٱللَّهِ حَقّٞ فَيَقُولُ مَا هَٰذَآ إِلَّآ أَسَٰطِيرُ ٱلۡأَوَّلِينَ ١٧
మరియు ఎవడైతే తన తల్లిదండ్రులతో ఇలా పలికాడో : మీకు వినాశనం కలుగు గాక. ఏమీ నేను మరణించిన తరువాత జీవింపజేయబడి నా సమాధి నుండి నేను వెలికి తీయబడుతానని మీరు నన్ను బెదిరిస్తున్నారా ?! వాస్తవానికి చాలా తరాలు గతించిపోయాయి. మరియు వాటిలో జనం చనిపోయారు కాని వారిలో నుండి ఎవరూ జీవింపజేయబడి మరల లేపబడలేదు. మరియు అతని తల్లిదండ్రులు అల్లాహ్ తో తమ కుమారునకు విశ్వాసము కొరకు మార్గదర్శకత్వం చేయమని సహాయమును కోరేవారు. మరియు వారిద్దరు తమ కుమారునితో ఇలా పలికేవారు : ఒక వేళ నీవు మరణాంతరం లేపబడటమును విశ్వసించకపోతే నీకు వినాశనం కలుగును కాబట్టి నీవు దాన్ని విశ్వసించు. నిశ్చయంగా మరణాంతరం లేపబడటం గురించి అల్లాహ్ వాగ్దానము ఎటువంటి సందేహం లేని సత్యము. మరణాంతరం లేపబడటము పట్ల తన తిరస్కారమును నవీనపరుస్తూ అతడు ఇలా పలుకుతాడు : మరణాంతరం లేపబడటం గురించి పలుకబడుతున్న ఈ మాటలు మాత్రం పూర్వికుల పుస్తకముల నుండి మరియు వారు వ్రాసిన వాటి నుండి అనుకరించబడినవి. అవి అల్లాహ్ నుండి నిరూపించబడలేదు.