Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Al-Ahqaf — Ayah 20

وَيَوۡمَ يُعۡرَضُ ٱلَّذِينَ كَفَرُواْ عَلَى ٱلنَّارِ أَذۡهَبۡتُمۡ طَيِّبَٰتِكُمۡ فِي حَيَاتِكُمُ ٱلدُّنۡيَا وَٱسۡتَمۡتَعۡتُم بِهَا فَٱلۡيَوۡمَ تُجۡزَوۡنَ عَذَابَ ٱلۡهُونِ بِمَا كُنتُمۡ تَسۡتَكۡبِرُونَ فِي ٱلۡأَرۡضِ بِغَيۡرِ ٱلۡحَقِّ وَبِمَا كُنتُمۡ تَفۡسُقُونَ ٢٠
మరియు ఆ రోజు అల్లాహ్ పై అవిశ్వాసమును కనబరచి మరియు ఆయన ప్రవక్తలను తిరస్కరించిన వారిని నరకాగ్ని వద్దకు అందులో వారిని శిక్షంచటం కొరకు ప్రవేశపెట్టటం జరుగుతుంది. మరియు వారిని మందలిస్తూ మరియు దూషిస్తూ ఇలా పలకబడుతుంది : మీరు మీ ఇహలోక జీవితంలోనే మీ మంచి వస్తువులను పోగొట్టుకున్నారు. మరియు మీరు అందులో ఉన్న సుఖభోగాలను అనుభవించేశారు. ఇక పోతే ఈ రోజున, మీరు భూమిలో అన్యాయంగా చూపించిన మీ అహంకారము వలన మరియు అవిశ్వాసం,పాపకార్యములతో మీరు అల్లాహ్ విధేయత నుండి వైదొలగిపోవటం వలన మిమ్మల్ని అవమానమమునకు గురి చేసే,మిమ్మల్ని పరాభవమునకు గురి చేసే శిక్ష మీకు ఇవ్వబడుతుంది.