Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Al-Ahqaf — Ayah 29

وَإِذۡ صَرَفۡنَآ إِلَيۡكَ نَفَرٗا مِّنَ ٱلۡجِنِّ يَسۡتَمِعُونَ ٱلۡقُرۡءَانَ فَلَمَّا حَضَرُوهُ قَالُوٓاْ أَنصِتُواْۖ فَلَمَّا قُضِيَ وَلَّوۡاْ إِلَىٰ قَوۡمِهِم مُّنذِرِينَ ٢٩
ఓ ప్రవక్తా మేము మీ వైపునకు జిన్నుల్లో నుండి ఒక వర్గమును మీ వద్దకు పంపిస్తే వారు మీ పై అవతరింపబడిన ఖుర్ఆన్ ను వింటున్నప్పటి వైనమును మీరు గుర్తు చేసుకోండి. వారు దాన్ని వినటానికి హాజరు అయినప్పుడు పరస్పరం ఇలా మాట్లాడుకున్నారు : మేము దాన్ని వినగలిగే వరకు మీరు నిశబ్దంగా ఉండండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ఖిరాఅత్ ను ముగించగానే వారు తమ జాతి వారి వద్దకు ఒక వేళ వారు ఈ ఖుర్ఆన్ ను విశ్వసించకపోతే వారిని అల్లాహ్ శిక్ష నుండి హెచ్చరిస్తూ మరలారు.