Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Al-Ahqaf — Ayah 8

أَمۡ يَقُولُونَ ٱفۡتَرَىٰهُۖ قُلۡ إِنِ ٱفۡتَرَيۡتُهُۥ فَلَا تَمۡلِكُونَ لِي مِنَ ٱللَّهِ شَيۡـًٔاۖ هُوَ أَعۡلَمُ بِمَا تُفِيضُونَ فِيهِۚ كَفَىٰ بِهِۦ شَهِيدَۢا بَيۡنِي وَبَيۡنَكُمۡۖ وَهُوَ ٱلۡغَفُورُ ٱلرَّحِيمُ ٨
ఏమీ ఈ ముష్రికులందరు : నిశ్ఛయంగా ముహమ్మద్ ఈ ఖుర్ఆన్ ను కల్పించుకుని దాన్ని అల్లాహ్ కు అంటగట్టాడు అని పలుకుతున్నారా ?. ఓ ప్రవక్తా మీరు వారితో ఇలా పలకండి : ఒక వేళ నేను దాన్ని నా వద్ద నుండి కల్పించుకుని ఉండి అల్లాహ్ నన్ను శిక్షించదలచి ఉంటే మీకు నా విషయంలో ఎటువంటి ఉపాయం ఉండదు. అటువంటప్పుడు ఆయనపై అబద్దమును అపాదించి నేను ఎలా నా స్వయమును శిక్షకు సమర్పించుకుంటాను ?. మీరు అల్లాహ్ విషయంలో ఆయన ఖుర్ఆన్ విషయంలో దూషిస్తున్న వాటి గురించి మరియు నా విషయంలో అపనిందపాలు చేస్తున్నది అల్లాహ్ కు బాగా తెలుసు. నాకు,మీకు మధ్య సాక్ష్యంగా పరిశుద్ధుడైన ఆయన చాలు. మరియు ఆయన తన దాసుల్లోంచి పశ్ఛత్తాపముతో మరలే వారి పాపములను బాగా మన్నించేవాడును,వారిపై అపారంగా కరుణించేవాడును.