Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Muhammad — Ayah 12

إِنَّ ٱللَّهَ يُدۡخِلُ ٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ جَنَّٰتٖ تَجۡرِي مِن تَحۡتِهَا ٱلۡأَنۡهَٰرُۖ وَٱلَّذِينَ كَفَرُواْ يَتَمَتَّعُونَ وَيَأۡكُلُونَ كَمَا تَأۡكُلُ ٱلۡأَنۡعَٰمُ وَٱلنَّارُ مَثۡوٗى لَّهُمۡ ١٢
నిశ్ఛయంగా అల్లాహ్ పై మరియు ఆయన ప్రవక్తపై విశ్వాసమును కనబరచి సత్కర్మలు చేసేవారిని అల్లాహ్ స్వర్గ వనముల్లో ప్రవేశింపజేస్తాడు వాటి భవనములు,వాటి వృక్షముల క్రింది నుండి సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి. మరియు అల్లాహ్ పై,ఆయన ప్రవక్తపై అవిశ్వాసమును కనబరచినవారు ఇహలోకములో తమ మనోవాంఛలను అనుసరించి భోగబాగ్యాల్లో మునిగి ఉన్నారు. మరియు పశువులు తినే మాదిరిగా తింటున్నారు. వారి కడుపులు మరియు వారి మర్మాంగములు తప్ప వారికి ఎటువంటి ఉద్దేశము లేదు. ప్రళయదినమున అగ్నియే వారి నివాస స్థలము,అందులోనే వారు శరణు తీసుకుంటారు.