Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Muhammad — Ayah 15

مَّثَلُ ٱلۡجَنَّةِ ٱلَّتِي وُعِدَ ٱلۡمُتَّقُونَۖ فِيهَآ أَنۡهَٰرٞ مِّن مَّآءٍ غَيۡرِ ءَاسِنٖ وَأَنۡهَٰرٞ مِّن لَّبَنٖ لَّمۡ يَتَغَيَّرۡ طَعۡمُهُۥ وَأَنۡهَٰرٞ مِّنۡ خَمۡرٖ لَّذَّةٖ لِّلشَّٰرِبِينَ وَأَنۡهَٰرٞ مِّنۡ عَسَلٖ مُّصَفّٗىۖ وَلَهُمۡ فِيهَا مِن كُلِّ ٱلثَّمَرَٰتِ وَمَغۡفِرَةٞ مِّن رَّبِّهِمۡۖ كَمَنۡ هُوَ خَٰلِدٞ فِي ٱلنَّارِ وَسُقُواْ مَآءً حَمِيمٗا فَقَطَّعَ أَمۡعَآءَهُمۡ ١٥
అల్లాహ్ తన ఆదేశాలను పాటించి,తాను వారించిన వాటికి దూరంగా ఉండి తన భయభీతి కలిగిన వారికి అల్లాహ్ వారిని ప్రవేశింపజేస్తానని వాగ్దానం చేసిన స్వర్గము యొక్క గుణము : అందులో ఎక్కువ కాలం ఉండటం వలన వాసన గాని రుచి గాని మారని నీటి సెలయేళ్ళు ఉంటాయి. మరియు అందులో రుచి మారని పాల సెలయేళ్ళు ఉంటాయి. మరియు అందులో త్రాగేవారికి రుచికరమైన మధు పానియముల సెలయేళ్ళు ఉంటాయి. మరియు మలినముల నుండి శుద్ధి చేయబడిన తేనె సెలయేళ్ళు ఉంటాయి. మరియు వారి కొరకు అందులో వారు కోరుకునే ఫలాల రకములన్నీ ఉంటాయి. మరియు వారి కొరకు వాటన్నింటికి మించి వారి పాపముల కొరకు అల్లాహ్ వద్ద నుండి మన్నింపు ఉంటుంది. ఆయన వాటి మూలంగా వారిని శిక్షించడు. ఏమీ ఇటువంటి ప్రతిఫలము కలవాడికి నరకము నుండి ఎన్నడూ బయటికి రాకుండా అందులో నివాసముండేవాడితో సమానుడు కాగలడా ?. మరియు వారికి తీవ్రమైన వేడి గల నీరు త్రాపించబడును. దాని వేడి తీవ్రత వలన వారి కడుపులలోని పేగులు కోయబడుతాయి.