Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Muhammad — Ayah 36

إِنَّمَا ٱلۡحَيَوٰةُ ٱلدُّنۡيَا لَعِبٞ وَلَهۡوٞۚ وَإِن تُؤۡمِنُواْ وَتَتَّقُواْ يُؤۡتِكُمۡ أُجُورَكُمۡ وَلَا يَسۡـَٔلۡكُمۡ أَمۡوَٰلَكُمۡ ٣٦
నిశ్చయంగా ప్రాపంచిక జీవితం ఓ ఆట మరియు కాలక్షేపం మాత్రమే. కావున ఒక బుద్ధిమంతుడు వాటి వలన తన పరలోక కర్మ నుండి నిర్లక్ష్యం చేయకూడదు. మరియు ఒక వేళ మీరు అల్లాహ్ పై, ఆయన ప్రవక్తపై విశ్వాసమును కనబరచి, అల్లాహ్ కు ఆయన ఆదేశములను పాటించి,ఆయన వారించిన వాటిని విడనాడి భయభీతిని కలిగి ఉంటే ఆయన మీకు మీ కర్మల ప్రతిఫలమును తగ్గించకుండా సంపూర్ణంగా ప్రసాదిస్తాడు. మరియు ఆయన మీ నుండి మీ సంపదలను పూర్తిగా అడగడు. ఆయన మీ నుండి విధి దానమైన జకాత్ ను మాత్రమే అడుగుతాడు.