Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Muhammad — Ayah 38

هَٰٓأَنتُمۡ هَٰٓؤُلَآءِ تُدۡعَوۡنَ لِتُنفِقُواْ فِي سَبِيلِ ٱللَّهِ فَمِنكُم مَّن يَبۡخَلُۖ وَمَن يَبۡخَلۡ فَإِنَّمَا يَبۡخَلُ عَن نَّفۡسِهِۦۚ وَٱللَّهُ ٱلۡغَنِيُّ وَأَنتُمُ ٱلۡفُقَرَآءُۚ وَإِن تَتَوَلَّوۡاْ يَسۡتَبۡدِلۡ قَوۡمًا غَيۡرَكُمۡ ثُمَّ لَا يَكُونُوٓاْ أَمۡثَٰلَكُم ٣٨
ఇదిగో మీరే అల్లాహ్ మార్గంలో మీ సంపదల నుండి కొంత భాగమును ఖర్చు చేయమని పిలవబడిన వారందరు. మరియు మీ సంపదలన్నింటిని ఖర్చు చేయమని మీతో అడగబడలేదు. అయితే మీలో నుండి కొందరు దాని నుండి పిసినారితనంతో ఖర్చు చేయమని అడగబడిన దాని నుండి ఆగిపోయిన వారు ఉన్నారు. మరియు ఎవరైతే అల్లాహ్ మార్గంలో తన సంపద నుండి కొంత భాగమును ఖర్చు చేయటం నుండి పిసినారితనం చూపుతాడో వాస్తవానికి అతను ఖర్చు చేయటం యొక్క పుణ్యమును కొల్పోవటం వలన తన స్వయంపై మాత్రమే పిసినారితనం చూపుతాడు. మరియు అల్లాహ్ స్వయంసమృద్ధుడు ఆయనకు మీ ఖర్చు చేయటం యొక్క అవసరం లేదు. మరియు మీరు ఆయన అవసరం కలవారు. ఒక వేళ మీరు ఇస్లాం నుండి అవిశ్వాసం వైపునకు మరలితే ఆయన మిమ్మల్ని నాశనం చేసి ఇతర జాతిని తీసుకుని వస్తాడు. ఆ పిదప వారు మీలాంటి వారై ఉండరు. అంతే కాదు వారు ఆయనకు విధేయులై ఉంటారు.