Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Muhammad — Ayah 4

فَإِذَا لَقِيتُمُ ٱلَّذِينَ كَفَرُواْ فَضَرۡبَ ٱلرِّقَابِ حَتَّىٰٓ إِذَآ أَثۡخَنتُمُوهُمۡ فَشُدُّواْ ٱلۡوَثَاقَ فَإِمَّا مَنَّۢا بَعۡدُ وَإِمَّا فِدَآءً حَتَّىٰ تَضَعَ ٱلۡحَرۡبُ أَوۡزَارَهَاۚ ذَٰلِكَۖ وَلَوۡ يَشَآءُ ٱللَّهُ لَٱنتَصَرَ مِنۡهُمۡ وَلَٰكِن لِّيَبۡلُوَاْ بَعۡضَكُم بِبَعۡضٖۗ وَٱلَّذِينَ قُتِلُواْ فِي سَبِيلِ ٱللَّهِ فَلَن يُضِلَّ أَعۡمَٰلَهُمۡ ٤
విశ్వాసపరులారా మీరు అవిశ్వాసపరులను యుద్దం చేస్తుండగా ఎదుర్కొన్నపప్పుడు మీ ఖడ్గములతో వారి మెడలను వదించండి. వారిలో మీరు హత్యాకాండను అధికం చేసేంత వరకు వారితో యుద్ధమును కొనసాగించండి. వారి ప్రాబల్యమును కూకటి వ్రేళ్ళతో తీసివేయండి. మీరు వారిలో హత్యాకాండను అధికం చేసినప్పుడు ఖైదీల గొలుసులను బిగించండి. మీరు వారిని బందీలుగా చేసుకున్నప్పుడు ప్రయోజనమునకు తగినట్లుగా మీకు ఎంపిక చేసుకునే అధికారముంటుంది. ఎటువంటి బదులు లేకుండా వారిని బందీ నుండి విడుదల చేయటం ద్వారా లేదా ధనం లేదా వేరే ఇతర వాటి ద్వారా వారి నుండి లబ్ది పొంది వారిపై కనికరించటం. అవిశ్వాసపరులు ఇస్లాం స్వీకరించటం లేదా వారితో ఒప్పందం తో యుద్ధం ముగిసేంతవరకు వారితో మీరు యుద్దమును మరియు బందీలను చేయటమును కొనసాగించండి. ఈ ప్రస్తావించబడిన అవిశ్వాసపరులతో విశ్వాసపరులను పరీక్షించటం, కాల చక్రము, ఒకరిపై ఒకరికి విజయము ఇవి అల్లాహ్ ఆదేశము. ఒక వేళ అల్లాహ్ ఎటువంటి యుద్ధం లేకుండా అవిశ్వాసపరులపై విజయం కలిగించదలచుకుంటే వారిపై విజయమును కలిగించేవాడు. కాని ఆయన ధర్మ పోరాటమును మీలో నుండి కొందరిని కొందరితో పరీక్షించటానికి ధర్మబద్ధం చేశాడు. కాబట్టి ఆయన విశ్వాసపరుల్లోంచి ఎవరు యుద్ధం చేస్తాడో మరియు ఎవరు యుద్ధం చేయడో ఆయన పరీక్షిస్తాడు. మరియు ఆయన ఆవిశ్వాసపరుడిని విశ్వాసపరుడితో పరీక్షిస్తాడు. ఒక వేళ అతడు విశ్వాసపరుడిని వదించితే అతడు (విశ్వాసపరుడు) స్వర్గంలో ప్రవేశిస్తాడు. ఒక వేళ అతడిని విశ్వాసపరుడు వదిస్తే అతడు (అవిశ్వాసపరుడు) నరకంలో ప్రవేశిస్తాడు. మరియు అల్లాహ్ మార్గంలో వదించబడే వారి కర్మలను అల్లాహ్ వృధా చేయడు.