Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Al-Fath — Ayah 29

مُّحَمَّدٞ رَّسُولُ ٱللَّهِۚ وَٱلَّذِينَ مَعَهُۥٓ أَشِدَّآءُ عَلَى ٱلۡكُفَّارِ رُحَمَآءُ بَيۡنَهُمۡۖ تَرَىٰهُمۡ رُكَّعٗا سُجَّدٗا يَبۡتَغُونَ فَضۡلٗا مِّنَ ٱللَّهِ وَرِضۡوَٰنٗاۖ سِيمَاهُمۡ فِي وُجُوهِهِم مِّنۡ أَثَرِ ٱلسُّجُودِۚ ذَٰلِكَ مَثَلُهُمۡ فِي ٱلتَّوۡرَىٰةِۚ وَمَثَلُهُمۡ فِي ٱلۡإِنجِيلِ كَزَرۡعٍ أَخۡرَجَ شَطۡـَٔهُۥ فَـَٔازَرَهُۥ فَٱسۡتَغۡلَظَ فَٱسۡتَوَىٰ عَلَىٰ سُوقِهِۦ يُعۡجِبُ ٱلزُّرَّاعَ لِيَغِيظَ بِهِمُ ٱلۡكُفَّارَۗ وَعَدَ ٱللَّهُ ٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ مِنۡهُم مَّغۡفِرَةٗ وَأَجۡرًا عَظِيمَۢا ٢٩
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ప్రవక్త మరియు ఆయన వెంట ఉన్న వారు ఆయన సహచరులు యుద్దం చేస్తూ వచ్చిన అవిశ్వాసపరులపై కఠినులు. వారు పరస్పరం దయ చూపుకుంటూ,ప్రేమా అభిమానములను చూపుకుంటూ కరుణామయులు. ఓ చూసేవాడా నీవు వారిని పరిశుద్ధుడైన అల్లాహ్ కొరకు రుకూ చేస్తుండగా,సాష్టాంగపడుతుండగా చూస్తావు. వారు అల్లాహ్ తో తమపై మన్నింపును మరియు ఉన్నతమైన పుణ్యయమును అనుగ్రహించమని మరియు తమ నుండి ప్రసన్నుడవమని కోరుతారు. వారి చిహ్నము వారి ముఖములలో సాష్టాంగపడటము వలన కలిగిన గుర్తుల నుండి ఏదైతే సన్మార్గము నుండి,దారి నుండి మరియు వారి ముఖముల్లో నమాజు కాంతి నుండి కనబడుతుంది. ఇది మూసా అలైహిస్సలాంపై అవతరింపబడిన గ్రంధం తౌరాత్ వర్ణించిన లక్షణము మరియు ఈసా అలైహిస్సలాంపై అవతరింపబడిన గ్రంధం ఇంజీలులో వారి పరస్పర సహాయము విషయంలో మరియు వారి పరిపూర్ణతలో వారి ఉపమానము ఒక పైరుతో పోల్చబడినది అది దాన్ని చిన్నదిగా వెలికి తీస్తుంది. ఆ తరువాత బలమువంతునిగా,గట్టిగా తయారై తన కాండములపై నిలబడుతుంది. దాని బలము మరియు దాని పరిపూర్ణత పండించేవారిని ఆనందపరుస్తుంది. అల్లాహ్ వారి ద్వారా అవిశ్వాసపరులకు వారు వారిలో ఉన్న బలము,సమన్వయము మరియు పరిపూర్నతను చూసినప్పుడు క్రోదానికి గురిచేయటానికి. మరియు అల్లాహ్ అల్లాహ్ పై విశ్వాసమును కనబరచి సత్కర్మలు చేసిన సహచరులకు వారి పాపములు మన్నిస్తాడని మరియు వాటి వలన ఆయన వారిని శిక్షించడని మరియు గొప్ప ప్రతిఫలమైన స్వర్గము ఉన్నదని వాగ్దానం చేశాడు.