Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Al-Fath — Ayah 4

هُوَ ٱلَّذِيٓ أَنزَلَ ٱلسَّكِينَةَ فِي قُلُوبِ ٱلۡمُؤۡمِنِينَ لِيَزۡدَادُوٓاْ إِيمَٰنٗا مَّعَ إِيمَٰنِهِمۡۗ وَلِلَّهِ جُنُودُ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِۚ وَكَانَ ٱللَّهُ عَلِيمًا حَكِيمٗا ٤
అల్లాహ్ యే విశ్వాసపరుల హృదయములలో వారు తమ విశ్వాసముపై విశ్వాసమును అధికం చేసుకోవటానికి నిలకడను మరియు మనశ్శాంతిని అవతరింపజేశాడు. మరియు ఆకాశములలో,భూమిలో ఉన్న సైన్యములు ఒక్కడైన అల్లాహ్ వే. వాటి ద్వారా ఆయన తన దాసుల్లోంచి తలచుకున్న వారికి మద్దతును కలిగిస్తాడు. మరియు అల్లాహ్ తన దాసుల ప్రయోజనముల గురించి బాగా తెలిసినవాడును మరియు తాను దేనిలోనైతే సహాయమును,మద్దతును కలిగిస్తున్నాడో అందులో వివేకవంతుడు.