Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Al-Fath — Ayah 6

وَيُعَذِّبَ ٱلۡمُنَٰفِقِينَ وَٱلۡمُنَٰفِقَٰتِ وَٱلۡمُشۡرِكِينَ وَٱلۡمُشۡرِكَٰتِ ٱلظَّآنِّينَ بِٱللَّهِ ظَنَّ ٱلسَّوۡءِۚ عَلَيۡهِمۡ دَآئِرَةُ ٱلسَّوۡءِۖ وَغَضِبَ ٱللَّهُ عَلَيۡهِمۡ وَلَعَنَهُمۡ وَأَعَدَّ لَهُمۡ جَهَنَّمَۖ وَسَآءَتۡ مَصِيرٗا ٦
మరియు కపటవిశ్వాస పరుషులను,కపటవిశ్వాస స్త్రీలను శిక్షించటానికి మరియు అల్లాహ్ తో పాటు సాటి కల్పించే పురుషులను మరియు సాటి కల్పించే స్త్రీలను, తన ధర్మమునకు సహాయము చేయడని మరియు తన కలిమాను ఉన్నత శిఖరాలకు చేర్చడని అల్లాహ్ పట్ల అపనమ్మకము కలిగిన వారిని శిక్షించటం కొరకు. శిక్ష యొక్క వృత్తం వారిపైనే మరలివచ్చింది. మరియు అల్లాహ్ వారి అవిశ్వాసం వలన మరియు వారి అపనమ్మకం వలన వారిపై ఆగ్రహమును చూపాడు. మరియు వారిని తన కారుణ్యము నుండి గెంటివేశాడు. మరియు వారి కొరకు పరలోకంలో నరకము సిద్ధం చేశాడు. వారు అందులో శ్వాశ్వతంగా ఉండేటట్లుగా ప్రవేసిస్తారు. వారు మరలి వెళ్ళే నరకము ఎంతో చెడ్డదైన నివాస స్థలము.