Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Al-Hujurat — Ayah 17

يَمُنُّونَ عَلَيۡكَ أَنۡ أَسۡلَمُواْۖ قُل لَّا تَمُنُّواْ عَلَيَّ إِسۡلَٰمَكُمۖ بَلِ ٱللَّهُ يَمُنُّ عَلَيۡكُمۡ أَنۡ هَدَىٰكُمۡ لِلۡإِيمَٰنِ إِن كُنتُمۡ صَٰدِقِينَ ١٧
ఓ ప్రవక్త ఈ పల్లెవాసులందరు తమ ఇస్లామును స్వీకరించటమును మీ పై ఉపకారము చేసినట్లు చూపుతున్నారు. మీరు వారితో ఇలా పలకండి : అల్లాహ్ ధర్మములో మీరు ప్రవేశించటమును నా పై ఉపకారము చేసినట్లు చెప్పకండి. దాని ప్రయోజనము ఒక వేళ కలిగితే అది మీపైనే మరలుతుంది. కానీ అల్లాహ్ ఆయనే మీకు ఆయనపై విశ్వాసమును కనబరచే భాగ్యమును కలిగించి మీపై ఉపకారం చేశాడు ఒక వేళ మీరు అందులో ప్రవేశించారని మీ వాదనలో సత్యవంతులే అయితే.