Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Al-Hujurat — Ayah 7

وَٱعۡلَمُوٓاْ أَنَّ فِيكُمۡ رَسُولَ ٱللَّهِۚ لَوۡ يُطِيعُكُمۡ فِي كَثِيرٖ مِّنَ ٱلۡأَمۡرِ لَعَنِتُّمۡ وَلَٰكِنَّ ٱللَّهَ حَبَّبَ إِلَيۡكُمُ ٱلۡإِيمَٰنَ وَزَيَّنَهُۥ فِي قُلُوبِكُمۡ وَكَرَّهَ إِلَيۡكُمُ ٱلۡكُفۡرَ وَٱلۡفُسُوقَ وَٱلۡعِصۡيَانَۚ أُوْلَٰٓئِكَ هُمُ ٱلرَّٰشِدُونَ ٧
ఓ విశ్వాసపరులారా మీలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నారని,ఆయనపై దైవ వాణి అవతరింపబడుతున్నదని తెలుసుకోండి. కాబట్టి మీరు అబద్దము పలకటం నుండి జాగ్రత్తపడండి ఎందుకంటే ఆయనపై దైవ వాణి అవతరించి మీ అబద్దము పలకటం గురించి ఆయనకు తెలియపరుస్తుంది. మీ ప్రయోజనం ఎందులో ఉన్నదో దాని గురించి ఆయనకు బాగా తెలుసు. ఒక వేళ మీరు ఆయనకు ప్రతిపాదించిన వాటి విషయంలో ఆయన మీ మాట వింటే ఆయన మీ కొరకు ఇష్టపడని కష్టముల్లో మీరు పడిపోతారు. కాని అల్లాహ్ తన అనుగ్రహంతో మీ కొరకు విశ్వాసమును ఇష్టపడి,దాన్ని మీ మనస్సుల్లో మంచిగా చూపిస్తే మీరు విశ్వసించారు. మరియు ఆయన మీకు అవిశ్వాసమును,ఆయన విధేయత నుండి వైదొలగిపోవటమును అసహ్యకరంగా చేశాడు. మరియు మీకు ఆయన అవిధేయతను అసహ్యకరం చేశాడు. ఈ గుణములతో వర్ణించబడిన వారందరే సన్మార్గము,ఋజు మార్గముపై నడుస్తారు.