Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah An-Najm — Ayah 32

ٱلَّذِينَ يَجۡتَنِبُونَ كَبَٰٓئِرَ ٱلۡإِثۡمِ وَٱلۡفَوَٰحِشَ إِلَّا ٱللَّمَمَۚ إِنَّ رَبَّكَ وَٰسِعُ ٱلۡمَغۡفِرَةِۚ هُوَ أَعۡلَمُ بِكُمۡ إِذۡ أَنشَأَكُم مِّنَ ٱلۡأَرۡضِ وَإِذۡ أَنتُمۡ أَجِنَّةٞ فِي بُطُونِ أُمَّهَٰتِكُمۡۖ فَلَا تُزَكُّوٓاْ أَنفُسَكُمۡۖ هُوَ أَعۡلَمُ بِمَنِ ٱتَّقَىٰٓ ٣٢
మరియు ఎవరైతే చిన్న పాపములు కాకుండా పెద్ద పాపముల నుండి మరియు అసహ్యకరమైన పాపముల నుండి దూరంగా ఉంటారో ఇవి (చిన్న పాపములు) పెద్ద పాపములను వదిలి వేయటం వలన,విధేయత కార్యములను అధికంగా చేయటం వలన మన్నించబడుతాయి. ఓ ప్రవక్తా నిశ్చయంగా మీ ప్రభువు విశాలమైన మన్నింపు కలవాడు. ఆయన తన దాసుల పాపములను వారు వాటి నుండి మన్నింపు వేడుకున్నప్పుడు మన్నిస్తాడు. పరిశుద్ధుడైన ఆయనకు మీ స్థితులను గురించి మరియు మీ వ్యవహారముల గురించి మీ తండ్రి అయిన ఆదమ్ ను మట్టితో సృష్టించబడినప్పుడు మరియు మీరు మీ మాతృ గర్భముల్లో పిండములుగా ఉండి పుట్టుక తరువాత సృష్టించబడినప్పుడు బాగా తెలుసు. వాటిలో నుండి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. వాటి పై మీరు స్వయంగా దైవభీతిపరులని గొప్పగా చెప్పుకోకండి. పరిశుద్ధుడైన ఆయనకు ఆయన ఆదేశాలను పాటించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి ఆయనకు భయపడే వారి గురించి బాగా తెలుసు.