Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Al-Hadid — Ayah 13

يَوۡمَ يَقُولُ ٱلۡمُنَٰفِقُونَ وَٱلۡمُنَٰفِقَٰتُ لِلَّذِينَ ءَامَنُواْ ٱنظُرُونَا نَقۡتَبِسۡ مِن نُّورِكُمۡ قِيلَ ٱرۡجِعُواْ وَرَآءَكُمۡ فَٱلۡتَمِسُواْ نُورٗاۖ فَضُرِبَ بَيۡنَهُم بِسُورٖ لَّهُۥ بَابُۢ بَاطِنُهُۥ فِيهِ ٱلرَّحۡمَةُ وَظَٰهِرُهُۥ مِن قِبَلِهِ ٱلۡعَذَابُ ١٣
ఆ రోజు కపట విశ్వాస పురషులు మరియు కపట విశ్వాస స్త్రీలు విశ్వాసపరులతో ఇలా పలుకుతారు : మార్గమును దాటటానికి మాకు సహాయపడే మీ వెలుగును మేము పుచ్చుకుంటామని ఆశిస్తూ మీరు మా కోసం నిరీక్షించండి. మరియు కపటవిశ్వాసులతో వారిని హేళన చేస్తూ ఇలా పలకబడును : మీరు మీ వెనుకకు మరలి మీరు వెలుగును పొందే ఏదైన కాంతిని వెతకండి. అప్పుడు వారి మధ్య ఒక అడ్డు గోడ ఏర్పరచబడును. ఆ గోడకు ఒక ద్వారముండును. దాని లోపలి వైపు విశ్వాసపరులకు దగ్గర ఉన్న భాగములో కారుణ్యముండును. మరియు దాని వెలుపల వైపు కపట విశ్వాసులకు దగ్గర ఉన్న భాగములో శిక్ష ఉండును.