Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Al-Hadid — Ayah 16

۞ أَلَمۡ يَأۡنِ لِلَّذِينَ ءَامَنُوٓاْ أَن تَخۡشَعَ قُلُوبُهُمۡ لِذِكۡرِ ٱللَّهِ وَمَا نَزَلَ مِنَ ٱلۡحَقِّ وَلَا يَكُونُواْ كَٱلَّذِينَ أُوتُواْ ٱلۡكِتَٰبَ مِن قَبۡلُ فَطَالَ عَلَيۡهِمُ ٱلۡأَمَدُ فَقَسَتۡ قُلُوبُهُمۡۖ وَكَثِيرٞ مِّنۡهُمۡ فَٰسِقُونَ ١٦
ఏమీ అల్లాహ్ ను,ఆయన ప్రవక్తను విశ్వసించిన వారికి వారి హృదయములు పరిశుద్ధుడైన అల్లాహ్ స్మరణ కొరకు, ఆయన ఖుర్ఆన్ నుండి అవతరింపజేసిన వాగ్దానము,హెచ్చరికల నుండి మృధువుగా,మనశ్శాంతి పొందే సమయం రాలేదా ?. మరియు వారి హృదయములు కఠినంగా మారిపోవటంలో తౌరాత్ ఇవ్వబడిన యూదులు,ఇంజీల్ ఇవ్వబడిన క్రైస్తవుల మాదిరిగా కాకూడదు. వారికి మరియు వారి ప్రవక్తలు పంపించబడటానికి మధ్య చాలా కాలం గడిచిపోయినది అప్పుడు దాని వలన వారి హృదయములు కఠినంగా మారిపోయినవి. వారిలో నుండి చాలా మంది అల్లాహ్ విధేయత నుండి ఆయన పై అవిధేయత వైపునకు వైదొలిగిపోయారు.