Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Al-Hadid — Ayah 24

ٱلَّذِينَ يَبۡخَلُونَ وَيَأۡمُرُونَ ٱلنَّاسَ بِٱلۡبُخۡلِۗ وَمَن يَتَوَلَّ فَإِنَّ ٱللَّهَ هُوَ ٱلۡغَنِيُّ ٱلۡحَمِيدُ ٢٤
ఎవరైతే తమపై ఖర్చు చేయటము అనివార్యము చేయబడిన వాటి విషయంలో పిసినారితనమును చూపుతారో మరియు ఇతరులను పిసినారి తనం చూపమని ఆదేశిస్తారో వారు నష్టపోతారు. ఎవరైతే అల్లాహ్ పై విధేయత చూపటం నుండి విముఖత చూపుతారో వారు అల్లాహ్ కు నష్టం కలిగించలేరు. వారు మాత్రం తమ స్వయానికి నష్టం కలిగించుకుంటారు. నిశ్ఛయంగా అల్లాహ్ స్వయం సమృద్ధుడు. తన దాసుల విధేయత ఆయనకు అవసరం లేదు. అన్నీ స్థితుల్లో పొగడబడేవాడు.