Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Al-Mujadila — Ayah 19

ٱسۡتَحۡوَذَ عَلَيۡهِمُ ٱلشَّيۡطَٰنُ فَأَنسَىٰهُمۡ ذِكۡرَ ٱللَّهِۚ أُوْلَٰٓئِكَ حِزۡبُ ٱلشَّيۡطَٰنِۚ أَلَآ إِنَّ حِزۡبَ ٱلشَّيۡطَٰنِ هُمُ ٱلۡخَٰسِرُونَ ١٩
షైతాను వారిని లొంగదీసుకుని తన దుష్ప్రేరణతో అల్లాహ్ స్మరణను వారికి మరిపింపజేశాడు. కావున వారు ఆయనకు ఇష్టమైన వాటిని చేయలేదు. ఆయనకు కోపము తెచ్చే వాటిని మాత్రం వారు చేశారు. ఈ గుణములతో వర్ణించబడిన వీరందరూ ఇబ్లీసు సైన్యము మరియు అతడి అనుచరులు. వినండీ నిశ్ఛయంగా ఇబ్లీసు సైన్యము మరియు అతని అనుచరులే ఇహలోకములో మరియు పరలోకములో నష్టమును చవిచూసేవారు. వారు అపమార్గమునకు బదులుగా సన్మార్గమును మరియు నరకమునకు బదులుగా స్వర్గమును అమ్మివేశారు.