Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Al-Mujadila — Ayah 22

لَّا تَجِدُ قَوۡمٗا يُؤۡمِنُونَ بِٱللَّهِ وَٱلۡيَوۡمِ ٱلۡأٓخِرِ يُوَآدُّونَ مَنۡ حَآدَّ ٱللَّهَ وَرَسُولَهُۥ وَلَوۡ كَانُوٓاْ ءَابَآءَهُمۡ أَوۡ أَبۡنَآءَهُمۡ أَوۡ إِخۡوَٰنَهُمۡ أَوۡ عَشِيرَتَهُمۡۚ أُوْلَٰٓئِكَ كَتَبَ فِي قُلُوبِهِمُ ٱلۡإِيمَٰنَ وَأَيَّدَهُم بِرُوحٖ مِّنۡهُۖ وَيُدۡخِلُهُمۡ جَنَّٰتٖ تَجۡرِي مِن تَحۡتِهَا ٱلۡأَنۡهَٰرُ خَٰلِدِينَ فِيهَاۚ رَضِيَ ٱللَّهُ عَنۡهُمۡ وَرَضُواْ عَنۡهُۚ أُوْلَٰٓئِكَ حِزۡبُ ٱللَّهِۚ أَلَآ إِنَّ حِزۡبَ ٱللَّهِ هُمُ ٱلۡمُفۡلِحُونَ ٢٢
ఓ ప్రవక్తా అల్లాహ్ తో మరియు ఆయన ప్రవక్తతో శతృత్వముతో వ్యవహరించే వారితో అల్లాహ్ ను విశ్వసించి,ప్రళయదినమును విశ్వసించే ఏ జాతి వారు ఇష్టపడటమును మరియు స్నేహం చేయటమును మీరు పొందరు. ఒక వేళ అల్లాహ్,ఆయన ప్రవక్త శతృవులైన వీరందరు వారి తండ్రులైన లేదా వారి కుమారులైన లేదా వారి సోదరులైన లేదా వారు సంబంధము కలిగిన వారి కుటుంబము వారైన సరే. ఎందుకంటే విశ్వాసము అల్లాహ్,ఆయన ప్రవక్త శతృవులతో స్నేహం చేయటం నుండి ఆపుతుంది. మరియు ఎందుకంటే విశ్వాసముతో సంబంధము అన్నింటితో సంబంధాల కన్నా ఎంతో గొప్పది. కాబట్టి అవి ఎదురైనప్పుడు అది ముందుంటుంది. వారందరు ఎవరైతే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త శతృవులతో స్నేహం చేయరో - ఒక వేళ వారు దగ్గరి బందువులైనా - వారే అల్లాహ్ వారి హృదయముల్లో విశ్వాసమును స్థిరపరచాడు. కావున అది మారదు. మరియు ఆయన వారిని తన వద్ద నుండి ఋజువుతో మరియు వెలుగుతో బలబరచాడు. మరియు ఆయన వారిని ప్రళయదినమున శాశ్వతమైన స్వర్గ వనముల్లో ప్రవేశింపజేస్తాడు. వాటి భవనముల క్రింది నుండి మరియు వాటి వృక్షముల క్రింది నుండి కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. వారు వాటిలో శాశ్వతంగా నివాసముంటారు. వాటి అనుగ్రహాలు వారి నుండి అంతము కావు మరియు వారు దాని నుండి నశించిపోరు. అల్లాహ్ వారి నుండి ఎంత సంతుష్ట పడతాడంటే దాని తరువాత ఆయన ఎన్నడూ ఆగ్రహానికి లోను కాడు. మరియు ఆయన వారికి ప్రసాదించిన అంతము కాని అనుగ్రహాల వలన వారు ఆయనతో సంతుష్టపడుతారు. పరిశుద్ధుడైన ఆయనను దర్శించుకోవటం వాటిలో నుంచే. ప్రస్తావించబడిన వాటితో వర్ణించబడిన వారందరు అల్లాహ్ ఆదేశించిన వాటిని పాటించే మరియు ఆయన వారించిన వాటి నుండి ఆగిపోయే అల్లాహ్ సైన్యము. వినండి నిశ్చయంగా అల్లాహ్ సైన్యమే వారే తాము ఆశించిన వాటిని పొంది తాము భయపడే వాటి నుండి తొలగిపోయి ఇహపరాల్లో సాఫల్యం చెందుతారు.