Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Al-Hashr — Ayah 15

كَمَثَلِ ٱلَّذِينَ مِن قَبۡلِهِمۡ قَرِيبٗاۖ ذَاقُواْ وَبَالَ أَمۡرِهِمۡ وَلَهُمۡ عَذَابٌ أَلِيمٞ ١٥
తమ అవిశ్వాసములో,తమపై కురిసిన శిక్షలో ఈ యూదులందరి ఉపమానము దగ్గరి కాలములో వారి కన్నా ముందు ఉన్న మక్కా ముష్రికుల ఉపమానము లాంటిది. వారు తమ అవిశ్వాసము యొక్క చెడ్డ పరిణామము రుచిని చవిచూశారు. బదర్ దినమున వారిలో నుండి హతమార్చబడేవారు హతమార్చబడ్డారు మరియు బందీ చేయబడేవారు బందీ చేయబడ్డారు. మరియు వారి కొరకు పరలోకములో బాధాకరమైన శిక్ష కలదు.