Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Al-Mumtahanah — Ayah 10

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓاْ إِذَا جَآءَكُمُ ٱلۡمُؤۡمِنَٰتُ مُهَٰجِرَٰتٖ فَٱمۡتَحِنُوهُنَّۖ ٱللَّهُ أَعۡلَمُ بِإِيمَٰنِهِنَّۖ فَإِنۡ عَلِمۡتُمُوهُنَّ مُؤۡمِنَٰتٖ فَلَا تَرۡجِعُوهُنَّ إِلَى ٱلۡكُفَّارِۖ لَا هُنَّ حِلّٞ لَّهُمۡ وَلَا هُمۡ يَحِلُّونَ لَهُنَّۖ وَءَاتُوهُم مَّآ أَنفَقُواْۚ وَلَا جُنَاحَ عَلَيۡكُمۡ أَن تَنكِحُوهُنَّ إِذَآ ءَاتَيۡتُمُوهُنَّ أُجُورَهُنَّۚ وَلَا تُمۡسِكُواْ بِعِصَمِ ٱلۡكَوَافِرِ وَسۡـَٔلُواْ مَآ أَنفَقۡتُمۡ وَلۡيَسۡـَٔلُواْ مَآ أَنفَقُواْۚ ذَٰلِكُمۡ حُكۡمُ ٱللَّهِ يَحۡكُمُ بَيۡنَكُمۡۖ وَٱللَّهُ عَلِيمٌ حَكِيمٞ ١٠
ఓ అల్లాహ్ ను విశ్వసించి ఆయన ధర్మ బద్ధం చేసిన వాటిని ఆచరించేవారా విశ్వాస స్త్రీలు అవిశ్వాస ప్రదేశము నుండి ఇస్లాం ప్రదేశమునకు మీ వద్దకు హిజ్రత్ చేసి వచ్చినప్పుడు మీరు వారి విశ్వాసము యొక్క నిజమవటం విషయంలో వారితో పరీక్ష తీసుకోండి. వారి విశ్వాసము గురించి అల్లాహ్ కు బాగా తెలుసు. వారి హృదయములు దేనిపై మరలి ఉన్నాయో ఏదీ కూడా ఆయనపై గోప్యంగా లేదు.వారిని పరీక్షించిన తరువాత మీకు వారి నిజాయితీ గురించి బహిర్గతం అయిన తరువాత ఒక వేళ మీరు వారిని మీరు విశ్వాసపరులని తెలుసుకుంటే వారిని మీరు వారి అవిశ్వాస భర్తల వైపునకు వాపసు చేయకండి. విశ్వాసపర స్త్రీలు అవిశ్వాసపరుల వివాహ బంధంలో కొనసాగటం ధర్మ సమ్మతం కాదు. మరియు అవిశ్వాసపరులు విశ్వాసపర స్త్రీలను వివాహం చేసుకోవటం ధర్మ సమ్మతం కాదు. మరియు వారు వారికి చెల్లించిన మహర్ ను మీరు వారి భర్తలకు ఇచ్చివేయండి. ఓ విశ్వాసపరులారా వారి ఇద్దత్ ముగిసిన తరువాత వారికి వారి మహర్ ఇచ్చినప్పుడు వారితో మీరు వివాహం చేసుకోవటంలో మీపై ఎటువంటి దోషం లేదు. మరియు ఎవరి భార్య అయితే అవిశ్వాసపరురాలో లేదా ఇస్లాం నుండి తిరిగిపోయినదో అమె అవిశ్వాసం వలన వారి నికాహ్ బంధం తెగిపోవటం వలన ఆమెను ఆపకూడదు. మరియు మీరు అవిశ్వాసపరులతో మీ మరలిపోయిన భార్యలకు మీరు ఖర్చు చేసిన మహర్ లను అడిగి తీసుకోండి. మరియు వారు కూడా ఇస్లాం స్వీకరించిన తమ భార్యలకు ఖర్చు చేసిన మహర్ లను అడిగి తీసుకోవాలి. మీకు ఈ ప్రస్తావించబడినది మీ వైపు నుండి మరియు వారి వైపు నుండి మహర్ ల మరలింపు అది అల్లాహ్ ఆదేశము. పరిశుద్ధుడైన ఆయన తాను తలచుకున్నదాని ద్వారా మీ మధ్య తీర్పునిస్తాడు. మరియు అల్లాహ్ కు తన దాసుల స్థితుల గురించి మరియు వారి కర్మల గురించి బాగా తెలుసు. వాటిలో నుంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. తన దాసుల కొరకు ఆయన ధర్మబద్ధం చేసిన వాటి విషయంలో వివేకవంతుడు.