Maulana Abder-Rahim ibn Muhammad

Ayah by Ayah

Tags

Download Links

A translation of every ayah of the Quran in Telugu.

Maulana Abder-Rahim ibn Muhammad translation for Surah Ar-Ra'd — Ayah 22

13:22
وَٱلَّذِينَ صَبَرُواْ ٱبۡتِغَآءَ وَجۡهِ رَبِّهِمۡ وَأَقَامُواْ ٱلصَّلَوٰةَ وَأَنفَقُواْ مِمَّا رَزَقۡنَٰهُمۡ سِرّٗا وَعَلَانِيَةٗ وَيَدۡرَءُونَ بِٱلۡحَسَنَةِ ٱلسَّيِّئَةَ أُوْلَٰٓئِكَ لَهُمۡ عُقۡبَى ٱلدَّارِ ٢٢
మరియు ఎవరైతే తమ ప్రభువు ప్రీతి కొరకు సహనం వహించి[1] మరియు నమాజ్ స్థాపించి[2] మరియు మేము ప్రసాదించిన ఉపాధి నుండి రహస్యంగా మరియు బహిరంగంగా (అల్లాహ్ మార్గంలో) ఖర్చు చేస్తూ, చెడును మంచి ద్వారా పారద్రోలుతూ ఉంటారో;[3] అలాంటి వారికే ఉత్తమ పరలోక గృహం ప్రతిఫలంగా ఉంటుంది.1
Footnotes
  • [1] అల్లాహ్ (సు.తా.) ఆజ్ఞలను పాటించటం మరయు పాపాల నుండి తప్పించుకోవటం ఒక సహనం. మరియు బాధలలో, ఆపదలలో సహనం వహించటం రెండవది. సత్పురుషులు ఈ రెండు రకాల సహనాన్ని వహిస్తారు. [2] నమా'జ్ స్థాపించటం అంటే నమా'జ్ ను దాని సమయంలో, భయభక్తులతో సరిగ్గా సలపటం. [3] వారు, ఎవరికైతే చెడు సంభవిస్తే దానికి బదులుగా మంచి చేస్తారో లేక మన్నించి సహనం వహిస్తారో, చూడండి, 41:34.