Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Az-Zumar — Ayah 38

وَلَئِن سَأَلۡتَهُم مَّنۡ خَلَقَ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضَ لَيَقُولُنَّ ٱللَّهُۚ قُلۡ أَفَرَءَيۡتُم مَّا تَدۡعُونَ مِن دُونِ ٱللَّهِ إِنۡ أَرَادَنِيَ ٱللَّهُ بِضُرٍّ هَلۡ هُنَّ كَٰشِفَٰتُ ضُرِّهِۦٓ أَوۡ أَرَادَنِي بِرَحۡمَةٍ هَلۡ هُنَّ مُمۡسِكَٰتُ رَحۡمَتِهِۦۚ قُلۡ حَسۡبِيَ ٱللَّهُۖ عَلَيۡهِ يَتَوَكَّلُ ٱلۡمُتَوَكِّلُونَ ٣٨
ఓ ప్రవక్త ఒక వేళ మీరు ఈ ముష్రికులందరితో ఆకాశములను,భూమిని ఎవరు సృష్టించారు అని అడిగితే వారు తప్పకుండా వాటిని సృష్టించినవాడు అల్లాహ్ అని సమాధానమిస్తారు. మీరు వారి విగ్రహాల అసమర్ధతను బహిరంగపరుస్తూ ఇలా పలకండి : మీరు అల్లాహ్ ను వదిలి ఆరాధిస్తున్న ఈ విగ్రహాల గురించి నాకు తెలియపరచండి. ఒక వేళ అల్లాహ్ నాకు ఏదైన కీడును కలగదలచితే అవి అతని కీడును నా నుండి తొలగించగలవా ?! లేదా నా ప్రభువు తన వద్ద నుండి నాకు ఏదైన కారుణ్యమును అనుగ్రహించదలచితే వాటికి ఆయన కారుణ్యమును ఆపె శక్తి కలదా ?! . మీరు వారితో ఇలా పలకండి : అల్లాహ్ ఒక్కడే నాకు చాలు. నా వ్యవహారాలన్నింటిలో ఆయనపైనే నేను నమ్మకమును కలిగి ఉంటాను. నమ్మకమును కలిగి ఉండేవారు ఆయన ఒక్కడిపైనే నమ్మకమును కలిగి ఉంటారు.