Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Az-Zumar — Ayah 39

قُلۡ يَٰقَوۡمِ ٱعۡمَلُواْ عَلَىٰ مَكَانَتِكُمۡ إِنِّي عَٰمِلٞۖ فَسَوۡفَ تَعۡلَمُونَ ٣٩
ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : ఓ నా జాతి వారా మీరు మీకు సంతృప్తికరమైన స్థితి అయిన అల్లాహ్ తో పాటు సాటి కల్పించటంపై ఆచరించండి. నిశ్చయంగా నేనూ నా ప్రభువు నాకు ఆదేశించినటువంటి ఆయన ఏకత్వం వైపునకు పిలవటం మరియు ఆరాధనను ఆయనకే ప్రత్యేకించుకోవటం పై ఆచరిస్తాను. అయితే తొందరలోనే మీరు ప్రతీ మార్గము యొక్క పరిణామమును తెలుసుకుంటారు.