Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Az-Zumar — Ayah 41

إِنَّآ أَنزَلۡنَا عَلَيۡكَ ٱلۡكِتَٰبَ لِلنَّاسِ بِٱلۡحَقِّۖ فَمَنِ ٱهۡتَدَىٰ فَلِنَفۡسِهِۦۖ وَمَن ضَلَّ فَإِنَّمَا يَضِلُّ عَلَيۡهَاۖ وَمَآ أَنتَ عَلَيۡهِم بِوَكِيلٍ ٤١
ఓ ప్రవక్తా నిశ్ఛయంగా మేము ఖుర్ఆన్ ను మీపై ప్రజల కొరకు సత్యముతో అవతరింపజేశాము మీరు వారిని హెచ్చరించటానికి. ఎవరైతే సన్మార్గము పొందుతాడో అతని సన్మార్గం పొందటం యొక్క ప్రయోజనం అతని స్వయం కొరకే. అయితే అతని సన్మార్గం పొందటం అల్లాహ్ కు ప్రయోజనం చేకూర్చదు. ఎందుకంటే ఆయన దాని నుండి అక్కరలేనివాడు. మరియు ఎవరైతే అపమార్గము పొందుతాడో అతని అపమార్గం పొందటం యొక్క నష్టము అతని స్వయమునకే కలుగును. అయితే పరిశుద్ధుడైన అల్లాహ్ కు అతని అపమార్గము నష్టం కలిగించదు. మరియు మీరు వారిని సన్మార్గముపై బలవంతం చేయటానికి మీరు వారిపై బాధ్యులు కారు. వారికి చేరవేయమని మీకు ఆదేశించబడిన వాటిని చేరవేయటం మాత్రమే మీపై బాధ్యత కలదు.