Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Az-Zumar — Ayah 42

ٱللَّهُ يَتَوَفَّى ٱلۡأَنفُسَ حِينَ مَوۡتِهَا وَٱلَّتِي لَمۡ تَمُتۡ فِي مَنَامِهَاۖ فَيُمۡسِكُ ٱلَّتِي قَضَىٰ عَلَيۡهَا ٱلۡمَوۡتَ وَيُرۡسِلُ ٱلۡأُخۡرَىٰٓ إِلَىٰٓ أَجَلٖ مُّسَمًّىۚ إِنَّ فِي ذَٰلِكَ لَأٓيَٰتٖ لِّقَوۡمٖ يَتَفَكَّرُونَ ٤٢
అల్లాహ్ యే ఆత్మలను వాటి ఆయుషు ముగిసేటప్పుడు స్వాధీనపరచుకుంటాడు. వేటి ఆయుషు పూర్తికాలేదో ఆ ఆత్మలను నిదుర సమయములో స్వాధీనపరచుకుని వేటి యొక్క మరణం నిర్ణయించబడినదో వాటిని ఆపుకుని వేటి పై దాని (మరణం) నిర్ణయం కాలేదో వాటిని పరిశుద్ధుడైన ఆయన జ్ఞానంలో నిర్ధారించబడిన వేళ వరకు వదిలివేస్తాడు. నిశ్చయంగా స్వాధీనపరచటం,వదిలివేయటం మరియు మరణం కలిగించటం,జీవింపజేయటంలో వీటిని చేసే సామర్ధ్యం కలవాడు ప్రజలను వారి మరణం తరువాతా లెక్కతీసుకోవటం కొరకు మరియు ప్రతిఫలం ప్రసాదించటం కొరకు మరణాంతరం లేపటంపై సామర్ధ్యం కలవాడని యోచన చేసే ప్రజలకు ఆధారాలు కలవు.