Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Az-Zumar — Ayah 52

أَوَلَمۡ يَعۡلَمُوٓاْ أَنَّ ٱللَّهَ يَبۡسُطُ ٱلرِّزۡقَ لِمَن يَشَآءُ وَيَقۡدِرُۚ إِنَّ فِي ذَٰلِكَ لَأٓيَٰتٖ لِّقَوۡمٖ يُؤۡمِنُونَ ٥٢
ఏమి ఈ ముష్రికులందరు వారు పలికినదే పలికారా. మరియు వారికి తెలియదా అల్లాహ్ తాను తలచిన వారిపై ఆహారోపాధిని పుష్కలంగా ఇస్తాడు. అతడిని పరీక్షించటానికి అతడు కృతజ్ఞత తెలుపుకుంటాడా లేదా కృతఘ్నుడవుతాడా ?!. మరియు ఆయన దాన్ని తాను కోరిన వారిపై కుదించివేస్తాడు అతడిని పరీక్షించటానికి అతడు అల్లాహ్ యొక్క కుదించటంపై సహనం చూపుతాడా లేదా ఆగ్రహానికి లోనవుతాడా ?!. నిశ్చయంగా ఈ ప్రస్తావించబడినటువంటి ఆహారోపాధిని పుష్కలంగా చేయటం మరియు దాన్ని కుదించటంలో విశ్వసించే జనుల కొరకు అల్లాహ్ పర్యాలోచనపై సూచనలు కలవు. ఎందుకంటే వారే ఆధారాల ద్వారా ప్రయోజనం చెందుతారు. మరియు అవిశ్వాసపరులు వాటిపై నుండి వాటి నుండి విముఖత చూపుతూ దాటిపోతారు.