Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Az-Zumar — Ayah 53

۞ قُلۡ يَٰعِبَادِيَ ٱلَّذِينَ أَسۡرَفُواْ عَلَىٰٓ أَنفُسِهِمۡ لَا تَقۡنَطُواْ مِن رَّحۡمَةِ ٱللَّهِۚ إِنَّ ٱللَّهَ يَغۡفِرُ ٱلذُّنُوبَ جَمِيعًاۚ إِنَّهُۥ هُوَ ٱلۡغَفُورُ ٱلرَّحِيمُ ٥٣
ఓ ప్రవక్తా మీరు అల్లాహ్ తో పాటు సాటి కల్పించి,పాపకార్యములకు పాల్పడి తమ స్వయంపై అతిక్రమించిన నా దాసులతో ఇలా పలకండి : మీరు అల్లాహ్ కారుణ్యము నుండి మరియు మీ పాపములకు ఆయన మన్నింపు నుండి నిరాశ చెందకండి. నిశ్ఛయంగా అల్లాహ్ ఆయన వైపునకు పశ్చాత్తాపముతో మరలేవారి పాపములన్నింటిని మన్నించి వేస్తాడు. నిశ్ఛయంగా ఆయన పశ్ఛాత్తాప్పడే వారి పాపములను బాగా మన్నించేవాడును, వారిపై కరుణించేవాడును.