Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Ghafir — Ayah 20

وَٱللَّهُ يَقۡضِي بِٱلۡحَقِّۖ وَٱلَّذِينَ يَدۡعُونَ مِن دُونِهِۦ لَا يَقۡضُونَ بِشَيۡءٍۗ إِنَّ ٱللَّهَ هُوَ ٱلسَّمِيعُ ٱلۡبَصِيرُ ٢٠
మరియు అల్లాహ్ న్యాయముగా తీర్పునిస్తాడు. ఆయన ఏ ఒక్కరిని అతని పుణ్యాలను తగ్గించి మరియు అతని పాపములను అధికం చేసి హింసించడు. మరియు ఎవరినైతే ముష్రికులు అల్లాహ్ ను వదిలి ఆరాధిస్తున్నారో వారు దేని గురించి తీర్పునివ్వరు. ఎందుకంటే వాటికి దేని అధికారము లేదు. నిశ్ఛయంగా అల్లాహ్ తన దాసుల మాటలను బాగా వినేవాడును, వారి సంకల్పాలను,వారి కర్మలను చూసేవాడును. మరియు ఆయన వారికి వాటిపరంగా ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.