Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Ghafir — Ayah 21

۞ أَوَلَمۡ يَسِيرُواْ فِي ٱلۡأَرۡضِ فَيَنظُرُواْ كَيۡفَ كَانَ عَٰقِبَةُ ٱلَّذِينَ كَانُواْ مِن قَبۡلِهِمۡۚ كَانُواْ هُمۡ أَشَدَّ مِنۡهُمۡ قُوَّةٗ وَءَاثَارٗا فِي ٱلۡأَرۡضِ فَأَخَذَهُمُ ٱللَّهُ بِذُنُوبِهِمۡ وَمَا كَانَ لَهُم مِّنَ ٱللَّهِ مِن وَاقٖ ٢١
ఏమిటీ ఈ ముష్రికులందరు భూమిలో సంచరించలేదా వారికన్న ముందు తిరస్కరించిన జాతుల వారి ముగింపు ఏమయిందో వారు యోచన చేయటానికి. నిశ్ఛయంగా ముగింపు దుర్బరంగా అయినది. ఆ జాతుల వారు వీరందరి కన్న అధిక బలము కలవారు. మరియు వారు భూమిలో నిర్మాణములు ఏర్పరచి వారందరు వదలనన్ని గుర్తులను వదిలి వెళ్ళారు. అప్పుడు అల్లాహ్ వారి పాపముల వలన వారిని నాశనం చేశాడు. మరియు వారి కొరకు అల్లాహ్ శిక్ష నుండి వారిని ఆపేవాడు ఎవడూ లేకపోయాడు.