Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Ghafir — Ayah 77

فَٱصۡبِرۡ إِنَّ وَعۡدَ ٱللَّهِ حَقّٞۚ فَإِمَّا نُرِيَنَّكَ بَعۡضَ ٱلَّذِي نَعِدُهُمۡ أَوۡ نَتَوَفَّيَنَّكَ فَإِلَيۡنَا يُرۡجَعُونَ ٧٧
ఓ ప్రవక్తా మీరు మీ జాతివారు బాధించిన దానిపై మరియు వారి తిరస్కారముపై సహనం చూపండి. నిశ్చయంగా మీకు సహాయం చేసే అల్లాహ్ వాగ్దానం సత్యము అందులో ఎటువంటి సందేహం లేదు. ఏ విధంగానైతే బదర్ దినమున సంభవించినదో అలా మీరు జీవించి ఉన్నప్పుడే వారికి మేము వాగ్దానం చేసిన శిక్ష లో నుండి కొంత భాగమును మీకు చూపించినా లేదా దాని కన్న ముందు మేము మీకు మరణమును కలిగించినా వారు ప్రళయదినమున మా ఒక్కరి వైపునకే మరలుతారు. అప్పుడు మేము వారికి వారి కర్మలపరంగా ప్రతిఫలమును ప్రసాదిస్తాము. అప్పుడు మేము వారందరిని నరకములో శాశ్వతంగా ఉండేవిధంగా ప్రవేశింపజేస్తాము.