Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Ghafir — Ayah 78

وَلَقَدۡ أَرۡسَلۡنَا رُسُلٗا مِّن قَبۡلِكَ مِنۡهُم مَّن قَصَصۡنَا عَلَيۡكَ وَمِنۡهُم مَّن لَّمۡ نَقۡصُصۡ عَلَيۡكَۗ وَمَا كَانَ لِرَسُولٍ أَن يَأۡتِيَ بِـَٔايَةٍ إِلَّا بِإِذۡنِ ٱللَّهِۚ فَإِذَا جَآءَ أَمۡرُ ٱللَّهِ قُضِيَ بِٱلۡحَقِّ وَخَسِرَ هُنَالِكَ ٱلۡمُبۡطِلُونَ ٧٨
మరియు నిశ్ఛయంగా మేము ఓ ప్రవక్తా మీ కన్న ముందు చాలా ప్రవక్తలను వారి జాతుల వద్దకు పంపించాము. అప్పుడు వారు వారిని తిరస్కరించారు మరియు వారికి బాధలు పెట్టారు. అప్పుడు వారు వారి తిస్కారముపై మరియు వారి బాధించటంపై సహనం చూపారు. ఈ ప్రవక్తలందరిలో నుంచి కొందరి సమాచారమును మేము మీకు వివరించి తెలియపరచాము. మరియు వారిలో నుంచి కొందరి సమాచారమును మేము మీకు తెలియపరచలేదు. మరియు ఏ ప్రవక్తకి తన జాతి వారి వద్దకు తన ప్రభువు వద్ద నుండి ఎటువంటి సూచనను పరిశుద్ధుడైన ఆయన ఇచ్ఛతో తప్ప తీసుకుని రావటం సరికాదు. కావున అవిశ్వాసపరులు తమ సమాజాలపై సూచనలను తీసుకుని రమ్మని సూచించటం అన్యాయము. అయితే విజయం లేదా ప్రవక్తలకు వారి జాతుల వారి మధ్య తీర్పు ద్వారా అల్లాహ్ ఆదేశము వచ్చినప్పుడు వారి మధ్య న్యాయపూరితంగా తీర్పు జరుగును. అప్పుడు అవిశ్వాసపరులు నాశనం చేయబడుతారు. మరియు ప్రవక్తలకు విముక్తి కలిగించబడును. మరియు దాసుల మధ్య తిర్పుఇవ్వబడే ఆ పరిస్థితులలో అసత్యపరులు తమ అవిశ్వాసం వలన వినాశన స్థానమునకు చేరుకోవటం వలన తమ స్వయానికి నష్టం కలిగించుకుంటారు.