Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Ash-Shuraa — Ayah 10

وَمَا ٱخۡتَلَفۡتُمۡ فِيهِ مِن شَيۡءٖ فَحُكۡمُهُۥٓ إِلَى ٱللَّهِۚ ذَٰلِكُمُ ٱللَّهُ رَبِّي عَلَيۡهِ تَوَكَّلۡتُ وَإِلَيۡهِ أُنِيبُ ١٠
ఓ ప్రజలారా మీరు మీ ధర్మ మూలముల్లో నుండి లేదా దాని శాఖల్లో నుండి దేని గురించైతే విభేదించుకున్నారో దాని ఆదేశం అల్లాహ్ వద్ద ఉన్నది. కాబట్టి అది ఆ విషయంలో ఆయన గ్రంధం వైపునకు లేదా ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సున్నత్ (హదీస్) వైపునకు మరలుతుంది. ఈ గుణాలను కలిగిన ఇతనే నా ప్రభువు. నా వ్యవహారములన్నింటిలో ఆయనపైనే నేను నమ్మకమును కలిగి ఉన్నాను. మరియు నేను ఆయన వైపునకే పశ్చాత్తాపముతో మరలుతాను.