Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Ash-Shuraa — Ayah 11

فَاطِرُ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِۚ جَعَلَ لَكُم مِّنۡ أَنفُسِكُمۡ أَزۡوَٰجٗا وَمِنَ ٱلۡأَنۡعَٰمِ أَزۡوَٰجٗا يَذۡرَؤُكُمۡ فِيهِۚ لَيۡسَ كَمِثۡلِهِۦ شَيۡءٞۖ وَهُوَ ٱلسَّمِيعُ ٱلۡبَصِيرُ ١١
అల్లాహ్ పూర్వ నమూనా లేకుండా ఆకాశములను మరియు భూమిని సృష్టించినవాడు. ఆయన మీలో నుండే మీ కొరకు జతలను చేశాడు. మరియు ఒంటెల్లో నుంచి,ఆవుల్లోంచి, మేకల్లో నుంచి మీ కొరకు జతలను చేశాడు. చివరికి మీరు మీ వలన అధికమయ్యారు. ఆయన మీ కొరకు తయారు చేసిన జతల నుండి వివాహం చేసుకోవటం ద్వారా మిమ్మల్ని సృష్టిస్తున్నాడు మరియు ఆయన మీ కొరకు తయారు చేసిన జంతువుల మాంసముల నుండి మరియు వాటి పాల నుండి మిమ్మల్ని జీవింపజేస్తున్నాడు. ఆయన సృష్టి రాసుల్లోంచి ఏదీ ఆయనకు పోలినది లేదు. ఆయన తన దాసుల మాటలను వినేవాడును మరియు వారి కర్మలను వీక్షించేవాడును. వాటిలో నుండి ఏదీ ఆయన నుండి తప్పిపోదు. మరియు ఆయన వారి కర్మల పరంగా వారికి తొందరలోనే ప్రతిఫలమును ప్రసాదిస్తాడు. ఒక వేళ అది మంచిగా ఉంటే మంచిని మరియు చెడ్డగా ఉంటే చెడును ప్రసాదిస్తాడు.