Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Ash-Shuraa — Ayah 13

۞ شَرَعَ لَكُم مِّنَ ٱلدِّينِ مَا وَصَّىٰ بِهِۦ نُوحٗا وَٱلَّذِيٓ أَوۡحَيۡنَآ إِلَيۡكَ وَمَا وَصَّيۡنَا بِهِۦٓ إِبۡرَٰهِيمَ وَمُوسَىٰ وَعِيسَىٰٓۖ أَنۡ أَقِيمُواْ ٱلدِّينَ وَلَا تَتَفَرَّقُواْ فِيهِۚ كَبُرَ عَلَى ٱلۡمُشۡرِكِينَ مَا تَدۡعُوهُمۡ إِلَيۡهِۚ ٱللَّهُ يَجۡتَبِيٓ إِلَيۡهِ مَن يَشَآءُ وَيَهۡدِيٓ إِلَيۡهِ مَن يُنِيبُ ١٣
మీ కొరకు నూహ్ అలైహిస్సలాంనకు దేనినైతే చేరవేసి ఆచరించమని మేము ఆదేశించామో ఆ ధర్మమునే ఆయన మీకు ధర్మబద్దము చేశాడు మరియు ఓ ప్రవక్తా దాన్ని మీకు దైవ వాణి ద్వారా చేరవేశాము. మరియు దేనినైతే చేరవేసి ఆచరించమని ఇబ్రాహీం,మూసా,ఈసా అలైహిముస్సలాంను మేము ఆదేశించినటువంటి దానినే మీ కొరకు ధర్మబద్దం చేశాము. మరియు దాని సారాంశము : మీరు ధర్మాన్ని నెలకోల్పండి, మరియు అందులో విభేదములను కలిగించటమును మీరు వదిలివేయండి. ముష్రికులపై మీరు వారిని పిలుస్తున్నటువంటి అల్లాహ్ తౌహీదు మరియు ఇతరుల ఆరాధనను వదిలివేయటం భారమైపోయింది. అల్లాహ్ తన దాసుల్లోంచి తాను తలచిన వారిని ఎంచుకుని తన ఆరాధన చేయటానికి మరియు తనపై విధేయత చూపటానికి భాగ్యమును కలిగిస్తాడు. మరియు వారిలో నుండి ఎవరైతే తమ పాపముల నుండి పశ్చాత్తాపముతో తన వైపునకు మరలే వారిని తన వైపునకు మార్గదర్శకం చేస్తాడు.