Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Ash-Shuraa — Ayah 14

وَمَا تَفَرَّقُوٓاْ إِلَّا مِنۢ بَعۡدِ مَا جَآءَهُمُ ٱلۡعِلۡمُ بَغۡيَۢا بَيۡنَهُمۡۚ وَلَوۡلَا كَلِمَةٞ سَبَقَتۡ مِن رَّبِّكَ إِلَىٰٓ أَجَلٖ مُّسَمّٗى لَّقُضِيَ بَيۡنَهُمۡۚ وَإِنَّ ٱلَّذِينَ أُورِثُواْ ٱلۡكِتَٰبَ مِنۢ بَعۡدِهِمۡ لَفِي شَكّٖ مِّنۡهُ مُرِيبٖ ١٤
మరియు అవిశ్వాసపరులు,ముష్రికులు కేవలం తమ వద్దకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తగా పంపించబడటంపై వాదన తమ ముందట నెలకొల్పబడిన తరువాత విభేదించుకున్నారు. వారి విభేదము కేవలం దౌర్జన్యము మరియు దుర్మార్గము వలన మాత్రమే. మరియు ఒక వేళ అల్లాహ్ జ్ఞానములో వారి నుండి శిక్షను ఆయన జ్ఞానములో నిర్ణయించబడిన కాలమైన ప్రళయదినము వరకు వెనుకకు నెట్టటం అన్నది ముందే జరిగి ఉండకపోతే అల్లాహ్ వారి మధ్య తీర్పు చేసేవాడు. అప్పుడు ఆయన అల్లాహ్ పట్ల వారి అవిశ్వాసము మరియు ఆయన ప్రవక్త పట్ల వారి తిరస్కారము వలన వారికి శిక్షను తొందరగా విధించేవాడు. మరియు నిశ్చయంగా తమ పూర్వికుల తరువాత మరియు ఈ ముష్రికులందరి తరువాత యూదుల్లోంచి తౌరాత్ కు, క్రైస్తవుల్లోంచి ఇంజీల్ కు వారసులు చేయబడిన వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకుని వచ్చిన ఈ ఖుర్ఆన్ విషయంలో సందేహములో ఉండి,దాన్ని తిరస్కరిస్తున్నారు.