Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Ash-Shuraa — Ayah 15

فَلِذَٰلِكَ فَٱدۡعُۖ وَٱسۡتَقِمۡ كَمَآ أُمِرۡتَۖ وَلَا تَتَّبِعۡ أَهۡوَآءَهُمۡۖ وَقُلۡ ءَامَنتُ بِمَآ أَنزَلَ ٱللَّهُ مِن كِتَٰبٖۖ وَأُمِرۡتُ لِأَعۡدِلَ بَيۡنَكُمُۖ ٱللَّهُ رَبُّنَا وَرَبُّكُمۡۖ لَنَآ أَعۡمَٰلُنَا وَلَكُمۡ أَعۡمَٰلُكُمۡۖ لَا حُجَّةَ بَيۡنَنَا وَبَيۡنَكُمُۖ ٱللَّهُ يَجۡمَعُ بَيۡنَنَاۖ وَإِلَيۡهِ ٱلۡمَصِيرُ ١٥
మీరు ఈ తిన్నని ధర్మము కొరకు పిలవండి. మరియు మీరు దానిపై స్థిరంగా ఉండి,అల్లాహ్ మీకు ఆదేశించిన విధంగా చేయండి. మరియు మీరు వారి అసత్య మనోవాంచనలను అనుసరించకండి. మరియు మీరు వారితో వాదించే సమయంలో ఇలా పలకండి : నేను అల్లాహ్ ను మరియు అల్లాహ్ తన ప్రవక్తలపై అవతరింపజేసిన గ్రంధములపై విశ్వాసమును కనబరిచాను. మరియు నేను మీ మధ్యన న్యాయముగా తీర్పు చేయమని అల్లాహ్ నన్ను ఆదేశించాడు. నేను ఆరాధించే అల్లాహ్ యే మాకు,మీకందరికి ప్రభువు. మా కర్మలు చెడ్డవైన,మంచివైనా మా కొరకే. మరియు మీ కర్మలు చెడ్డవైన,మంచివైన మీ కొరకే. మీ మధ్య,మా మధ్య వాదన స్పష్టమైన తరువాత ఎటువంటి వివాదం లేదు. అల్లాహ్ యే మా అందరి మధ్య సమీకరించేవాడు. ప్రళయదిమున ఆయన వైపునకే మరలటం జరుగును. అప్పుడు ఆయన మాలో నుండి ప్రతి ఒక్కరికి తగిన ప్రతిఫలమును ప్రసాదిస్తాడు. అప్పుడు అసత్యపరుడి నుండి సత్య వంతుడు మరియు అసత్య వంతుడి నుండి సత్యవంతుడు స్పష్టమవుతాడు.