Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Ash-Shuraa — Ayah 22

تَرَى ٱلظَّٰلِمِينَ مُشۡفِقِينَ مِمَّا كَسَبُواْ وَهُوَ وَاقِعُۢ بِهِمۡۗ وَٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ فِي رَوۡضَاتِ ٱلۡجَنَّاتِۖ لَهُم مَّا يَشَآءُونَ عِندَ رَبِّهِمۡۚ ذَٰلِكَ هُوَ ٱلۡفَضۡلُ ٱلۡكَبِيرُ ٢٢
ఓ ప్రవక్తా షిర్కు ద్వారా,పాపకార్యముల ద్వారా తమ స్వయంపై దుర్మార్గమునకు పాల్పడిన వారు తాము చేసుకున్న పాపము వలన కలిగే శిక్ష నుండి భయపడుతుండగా మీరు చూస్తారు. మరియు శిక్ష వారిపై ఖచ్చితంగా వచ్చిపడుతుంది. అప్పుడు పశ్చాత్తాపముతో ఖాళీగా ఉన్న భయము వారికి ప్రయోజనం కలిగించదు. మరియు అల్లాహ్ పై, ఆయన ప్రవక్త పై విశ్వాసమును కనబరచి వారికి భిన్నంగా సత్కర్మలు చేసిన వారు స్వర్గవనములలో సుఖభోగాలను అనుభవిస్తుంటారు. వారి కొరకు వారి ప్రభువు వద్ద వారు కోరుకునే ఎన్నటికి అంతం కాని రకరకాల అనుగ్రహాలు కలవు. అదే పెద్ద అనుగ్రహము దానికి ఏ అనుగ్రహము సమానము కాదు.