Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Ash-Shuraa — Ayah 23

ذَٰلِكَ ٱلَّذِي يُبَشِّرُ ٱللَّهُ عِبَادَهُ ٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِۗ قُل لَّآ أَسۡـَٔلُكُمۡ عَلَيۡهِ أَجۡرًا إِلَّا ٱلۡمَوَدَّةَ فِي ٱلۡقُرۡبَىٰۗ وَمَن يَقۡتَرِفۡ حَسَنَةٗ نَّزِدۡ لَهُۥ فِيهَا حُسۡنًاۚ إِنَّ ٱللَّهَ غَفُورٞ شَكُورٌ ٢٣
ఇదే గొప్ప శుభవార్త దేని గురించైతే అల్లాహ్ తన ప్రవక్త చేతి ద్వారా అల్లాహ్ పై,ఆయన ప్రవక్తల పై విశ్వాసమును కనబరచి సత్కర్మలను చేసేవారికి శుభవార్తను ఇస్తున్నాడు. ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : నేను సత్యమును చేరవేయటం పై మీ వైపునకు ప్రయోజనం మరలే ఒక పుణ్యమును మాత్రమే మీ నుండి కోరుతున్నాను. అది మీలో నా బంధుత్వము కొరకు మీరు నన్ను ఇష్టపడటం. మరియు ఎవరైతే ఒక పుణ్యము సంపాదించుకుంటాడో అతని కొరకు మేము దాని పుణ్యమును అధికం చేస్తాము. ఎలాగంటే ఒక పుణ్యమును దానికి పది రెట్లుగా. నిశ్ఛయంగా అల్లాహ్ తన దాసుల్లోంచి తన వైపునకు పశ్చాత్తాపముతో మరలే వారి పాపములను మన్నించేవాడును, ఆయన మన్నతను ఆశిస్తూ సత్కర్మలను చేసేవారి సత్కర్మలను ఆదరించేవాడును.