Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Ash-Shuraa — Ayah 24

أَمۡ يَقُولُونَ ٱفۡتَرَىٰ عَلَى ٱللَّهِ كَذِبٗاۖ فَإِن يَشَإِ ٱللَّهُ يَخۡتِمۡ عَلَىٰ قَلۡبِكَۗ وَيَمۡحُ ٱللَّهُ ٱلۡبَٰطِلَ وَيُحِقُّ ٱلۡحَقَّ بِكَلِمَٰتِهِۦٓۚ إِنَّهُۥ عَلِيمُۢ بِذَاتِ ٱلصُّدُورِ ٢٤
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఖుర్ఆన్ ను కల్పించుకుని దాన్ని తన ప్రభువుకి సంబంధము అంటగట్టారని ముష్రికుల ఆరోపణ. మరియు అల్లాహ్ వారిని ఖండిస్తూ ఇలా పలికాడు : ఒక వేళ మీరు స్వయంగా అబద్దమును కల్పించుకుంటే నేను మీ హృదయముపై సీలు వేసేవాడిని మరియు కల్పించబడిన అసత్యమును తుడిచివేసేవాడిని మరియు సత్యమును ఉండేట్లు చేసేవాడిని. విషయం అలా కానప్పుడు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు తన ప్రభువు వద్ద నుండి దైవవాణి అవతరింపబడటం సత్యం అని ఋజువవుతున్నది. నిశ్ఛయంగా ఆయన తన దాసుల హృదయములలో ఉన్న వాటిని బాగా తెలిసినవాడు. వాటిలో నుంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు.