Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Ash-Shuraa — Ayah 44

وَمَن يُضۡلِلِ ٱللَّهُ فَمَا لَهُۥ مِن وَلِيّٖ مِّنۢ بَعۡدِهِۦۗ وَتَرَى ٱلظَّٰلِمِينَ لَمَّا رَأَوُاْ ٱلۡعَذَابَ يَقُولُونَ هَلۡ إِلَىٰ مَرَدّٖ مِّن سَبِيلٖ ٤٤
మరియు అల్లాహ్ ఎవరినైతే సన్మార్గము పొందటం నుండి విఫలం చేసి అతన్ని సత్యము నుండి తప్పించివేస్తాడో అతని కొరకు దాని తరువాత అతని వ్యవహారమును పరిరక్షించే పరిరక్షకుడు ఎవడూ ఉండడు. మరియు అవిశ్వాసముతో,పాపకార్యములతో తమ స్వయంపై దుర్మార్గమునకు పాలపడిన వారు ప్రళయదినమున శిక్షను కళ్ళారా చూసినప్పుడు ఈ విధంగా ఆశిస్తూ ఇలా పలుకుతుండగా మీరు చూస్తారు : మేము అల్లాహ్ తో తౌబా చేసుకోవటానికి ఇహలోకము వైపు మరలటం కొరకు ఏదైన మార్గం ఉన్నదా ?.