Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Ash-Shuraa — Ayah 45

وَتَرَىٰهُمۡ يُعۡرَضُونَ عَلَيۡهَا خَٰشِعِينَ مِنَ ٱلذُّلِّ يَنظُرُونَ مِن طَرۡفٍ خَفِيّٖۗ وَقَالَ ٱلَّذِينَ ءَامَنُوٓاْ إِنَّ ٱلۡخَٰسِرِينَ ٱلَّذِينَ خَسِرُوٓاْ أَنفُسَهُمۡ وَأَهۡلِيهِمۡ يَوۡمَ ٱلۡقِيَٰمَةِۗ أَلَآ إِنَّ ٱلظَّٰلِمِينَ فِي عَذَابٖ مُّقِيمٖ ٤٥
మరియు ఓ ప్రవక్తా ఈ దుర్మార్గులందరిని, వారు నరకాగ్నిపై ప్రవేశపెట్టబడినప్పుడు వారు అవమానమునకు గురై,సిగ్గు పడతూ ప్రజల వైపునకు దాని భయము వారికి ఉండటం వలన దొంగ చూపులు చూస్తుండగా మీరు చూస్తారు. మరియు అల్లాహ్ పై,ఆయన ప్రవక్తపై విశ్వాసమును కనబరచిన వారు ఇలా పలుకుతారు : నిశ్చయంగా వాస్తవానికి నష్టపోయేవారు వారే ఎవరైతే అల్లాహ్ శిక్షను పొందటం వలన ప్రళయ దినమున తమకు మరియు తమ ఇంటి వారికి నష్టం కలిగించుకుంటారో. వినండి నిశ్ఛయంగా అవిశ్వాసముతో,పాపకార్యములతో తమ స్వయంనకు అన్యాయం చేసుకున్న వారు ఎన్నటికి అంతం కాని శాశ్వతమైన శిక్షలో ఉంటారు.